

గతంలో ఒక సినిమా విడుదలైన రోజే దర్శకుడి ప్రతిభకు అసలైన పరీక్ష ఎదురయ్యేది. ప్రేక్షకులకు నచ్చితే ప్రశంసలు దక్కేవి, లేదంటే విమర్శలు తప్పేవి కావు. కానీ ఇప్పుడు ఓటీటీ వేదికలు అందుబాటులోకి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోని సినిమాలకు డిజిటల్ విడుదల తర్వాత కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
రాజా సాబ్, పెద్ది, ది పారడైజ్ వంటి చిత్రాల్లోని కొన్ని సీన్లపై ఇప్పటికే మీమ్స్, ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో ఫలితం తేలితే సరిపోయేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సినిమా చూసే ప్రేక్షకులు సైతం ప్రతి సన్నివేశాన్ని విశ్లేషిస్తూ తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శకులు మరింత జాగ్రత్తగా కథలు, సన్నివేశాలను రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓటీటీ విడుదల అనేది ఇప్పుడు దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!