
షోస్

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైన ఘటన కలకలం రేపుతోంది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉండొచ్చన్న అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎన్‌ఐఏ బృందం ఘటనాస్థలిని సందర్శించనున్నట్లు సమాచారం. ఉగ్రవాది షెహజాద్ భట్టి నెట్‌వర్క్‌తో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ హ్యాండ్లర్ల కదలికలపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉందా అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!