

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవల కథకు ప్రాధాన్యం ఉన్న, నటనకు అవకాశం కలిగిన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్లో కొత్త దిశగా ముందుకెళ్తున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్న ఆమె, మహిళా ప్రాధాన్య కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘సిస్టమ్’ వెబ్ సిరీస్లో న్యాయవాది పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సిరీస్ ఓటీటీలో మంచి ఆదరణ పొందుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనాక్షి, బలమైన మహిళా పాత్రలను ఎంచుకోవడం పూర్తిగా తన నిర్ణయమేనని చెప్పారు. ప్రస్తుతం తనకు సంతోషం, సంతృప్తి ఇచ్చే కథలనే ఎంపిక చేసుకుంటున్నానని వెల్లడించారు. గతంలో ఇతర కారణాలతో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఇప్పుడు మాత్రం తనకు నచ్చిన ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ తనను హాలీవుడ్ దిగ్గజ నటీమణులు మేరిల్ స్ట్రీప్, కేట్ విన్స్లెట్లతో పోల్చడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, అదే సమయంలో తనపై మరింత బాధ్యతను పెంచిందని సోనాక్షి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!