

ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రోజుల వ్యవధిలో విడుదల కావడం సాధారణమే. కానీ అగ్రకథానాయిక నటించిన రెండు చిత్రాలు కేవలం 48 గంటల వ్యవధిలో థియేటర్లలోకి రావడం అరుదు. ఇప్పుడు నయనతార ‘టాక్సిక్’, ‘హాయ్’ సినిమాలతో ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితిని ఎదుర్కోనున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’లో నయనతార గంగ అనే శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
యశ్ సినిమా విడుదలైన రెండు రోజులకే కవిన్‌కు జోడీగా నయనతార ‘హాయ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆగస్టు 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు 28కి వాయిదా పడింది. ‘టాక్సిక్’కు పూర్తిగా భిన్నమైన శైలిలో ‘హాయ్’లో నయనతార కనిపించనున్నారు. దీంతో ఒక సినిమా ప్రభావం మరొకదానిపై ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లు, ఈవెంట్లకు దూరంగా ఉండే నయనతార ఈసారి ‘టాక్సిక్’, ‘హాయ్’ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!