

కోలీవుడ్ నటి దర్శా గుప్తా బుల్లితెర సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత రుద్ర తాండవం, ఓమై గోస్ట్ చిత్రాల ద్వారా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యోగి బాబు సరసన ‘మెడికల్ మిరాకిల్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలు వైరల్ కావడంతో, నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన దర్శా గుప్తా, తన ఫాలోవర్లు తన కుటుంబ సభ్యుల్లాంటివారని, వారితో కనెక్ట్ అవ్వడానికే సోషల్ మీడియాలో ఉన్నానని తెలిపారు. తాను తల్లిదండ్రులు నేర్పిన విలువల ప్రకారమే జీవిస్తున్నానని, గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేసినా కొన్ని హద్దులు ఎప్పటికీ దాటనని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!