
బిజినెస్

స్టార్ హీరో అజిత్ కుమార్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డేర్‌డెవిల్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ఈ రెండో ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా అజిత్ భార్య షాలిని నిర్మాతగా మారడం నిలిచింది. ఈ సినిమా అధికారికంగా ప్రకటించబడగా, సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా ఇంటర్వ్యూలో అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ ‘డేర్‌డెవిల్’ పూర్తిగా భిన్నమైన కథతో రూపొందుతుందని తెలిపారు. కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించేలా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే తన కష్టకాలంలో అజిత్ ఇచ్చిన ప్రోత్సాహం తనకు ధైర్యం ఇచ్చిందని, అదే తనను తిరిగి నిలబెట్టి ‘మార్క్ ఆంటోనీ’ వంటి హిట్ ఇవ్వడానికి సహాయపడిందని భావోద్వేగంగా చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!