

శృతి హాసన్ వాయిస్ నరేషన్తో రూపొందిన శక్తివంతమైన క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ‘సైలెంట్ స్క్రీమ్స్’ ఇప్పుడు సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణలోని వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. మహిళలపై నేరాలు కేవలం గణాంకాలుగా మారుతున్న ఈ కాలంలో, ఆ సంఖ్యల వెనుక ఉన్న బాధితుల మనుష్య కథలను హృదయాన్ని తాకే విధంగా ఇది ఆవిష్కరిస్తుంది.
కేవలం నేరాలు వివరాలకే పరిమితం కాకుండా, న్యాయం కోసం బాధితులు ఎదుర్కొనే పోరాటం, వారి మౌన వేదనను ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జిగ్రీస్, మఫ్తీ పోలీస్ వంటి వినోదాత్మక కంటెంట్‌తో పాటు ఆలోచన రేపే ఈ సిరీస్‌ను అందిస్తూ సన్ నెక్స్ట్ తన వైవిధ్యాన్ని చాటుతోంది. 4,000 కు పైగా టైటిల్స్, 44 కు పైగా లైవ్ ఛానళ్లతో సన్ నెక్స్ట్ అన్ని వయసుల ప్రేక్షకులకు ఒకే వేదికగా నిలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!