2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

Writer: Nithish 02:49 PM, 2 అక్టోబర్, 2026
‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

టాలీవుడ్‌లో సినిమాల కంటే వాటి చుట్టూ జరిగే సోషల్‌ మీడియా చర్చలు కూడా హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా హీరో సందీప్‌ కిషన్‌ నటించిన ‘సిగ్మా’ మూవీ చుట్టూ అలాంటి చర్చే మొదలైంది. జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందు సందీప్‌ కిషన్‌ చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. తన సినిమాను లక్ష్యంగా చేసుకుని కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా ప్రతికూల ట్వీట్లు చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో, ఇందుకోసం ఎవరు డబ్బులు ఖర్చు చేస్తున్నారో తనకు తెలుసంటూ హెచ్చరికలు చేయడంతో అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ మొదలైంది. అయితే సందీప్‌ తన ట్వీట్‌లో ఎవరిపేరునూ ప్రస్తావించలేదు.

మరోవైపు ఓ సినీ విమర్శకుడి పేరుతో వైరల్‌ అవుతున్న మరో ట్వీట్‌ కూడా చర్చకు దారితీసింది. డిజిటల్‌ మాధ్యమంలో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ అందులో పేర్కొనడంతో కొందరు దాన్ని ‘సిగ్మా’ వివాదంతో ముడిపెడుతున్నారు. అయితే ఆ వ్యాఖ్యలు నేరుగా సందీప్‌ కిషన్‌ను ఉద్దేశించినవేనని స్పష్టత లేదు. ఇదిలా ఉంటే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనలో సానుకూల అభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌, ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, సందీప్‌ కిషన్‌ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఎస్‌. థమన్‌ నేపథ్య సంగీతం యాక్షన్‌ సన్నివేశాలను మరింత ఎలివేట్‌ చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో విడుదలకు ముందు మొదలైన ట్వీట్‌ వార్‌ చర్చకు తోడు, సినిమాకు వస్తున్న స్పందన ‘సిగ్మా’పై ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

ట్యాగ్లు
సిగ్మా మూవీసందీప్ కిషన్జాసన్ సంజయ్ఎస్ థమన్టాలీవుడ్తెలుగు సినిమాసిగ్మా ట్వీట్ వార్సిగ్మా సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం
క్రీడలు

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?
జనరల్

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?
రివ్యూలు

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌
జనరల్

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు
సినిమాలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన
సినిమాలు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌
సినిమాలు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
జనరల్

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు
జనరల్

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు
జనరల్

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!