

ఈ నగరానికి ఏమైంది సినిమాకు కొనసాగింపుగా రూపొందిన ఈఎన్ఈ రిపీట్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే మొదటి చిత్రాన్ని నిర్మించిన సురేష్ బాబు ఈసారి నిర్మాతగా లేకపోవడం వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సినిమా బడ్జెట్, నిర్మాణ వ్యయం, విడుదలలో జరిగిన జాప్యం వంటి అంశాలు ఆయన నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాలపై నిర్మాత సృజన్ యారబోలు స్పందించడంతో అసలు కారణాలపై స్పష్టత వచ్చింది.
నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ ధాస్యం రచన, దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించారు. సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. సినిమా కోసం రూ.10 ఖర్చవుతుందని అనుకుంటే, సురేష్ బాబు రూ.7లో పూర్తి చేయాలని భావించారట. చివరకు నిర్మాణ వ్యయం రూ.12 నుంచి 13 కోట్లకు చేరింది. అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నా ఆలస్యం కావడంతో వడ్డీ భారం పెరిగింది. నటీనటుల పారితోషికాల విషయంలోనూ అభిప్రాయ భేదాలు వచ్చినట్లు సృజన్ వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!