

తెలుగు చిత్ర పరిశ్రమలో దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. కేవలం నటనతోనే కాకుండా అభిమానులతో కలిసిపోయే విధానం, ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తీరు ఆయనకు మరింత ఆదరణ తెచ్చిపెడుతున్నాయి. ఇతర భాషలకు చెందిన హీరోలు కూడా తెలుగు ప్రేక్షకులతో అనుబంధం పెంచుకోవడంలో దుల్కర్ అనుసరిస్తున్న పద్ధతిని గమనించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించారు. భారీ యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా, కథలో తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూలలో తెలుగులో మాట్లాడటం, కార్యక్రమాల్లో అభిమానులతో సరదాగా గడపడం ఆయన ప్రత్యేకతగా మారింది. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. కథల ఎంపికతో పాటు ప్రేక్షకులతో మమేకమయ్యే విధానం కూడా దుల్కర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!