

ఒకప్పుడు వరుస విజయాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం మళ్లీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎస్.ఎస్. రాజమౌళి మాత్రం ప్రతి చిత్రంతో తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్నారు. ఒకే రంగంలో ఇద్దరు దిగ్గజ దర్శకుల ప్రయాణాలు ఇప్పుడు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ తేడాకు ప్రధాన కారణం కథల ఎంపిక, వాటిని తెరపై ఆవిష్కరించే విధానమేనని సినీ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ తన చిత్రాల్లో సాంకేతికత, భారీ సెట్టింగులు, అద్భుతమైన దృశ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రోబో వరకు ఆయన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే రచయిత సుజాత రంగనాథన్ మరణం తర్వాత కథల్లో మునుపటి బలం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి మాత్రం కథ, పాత్రలు, కథనం, కీలక సన్నివేశాల రూపకల్పనపై ఎంతో శ్రద్ధ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి రూపొందిస్తున్నారు. శంకర్ కూడా కథలపై దృష్టి పెడితే తిరిగి విజయాలు అందుకోవచ్చనే చర్చ సాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!