
సినిమాలు

వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన డిజిటల్ మీడియా అవార్డ్స్ 2026 వేడుక ఘనంగా జరిగింది. డిజిటల్ మీడియా రంగంలో విశేష సేవలు అందించిన కంటెంట్ సృష్టికర్తలు, జర్నలిస్టులు, సంపాదకులను ఈ కార్యక్రమంలో సత్కరించారు. తెలుగు సినీ పోర్టల్ ‘ఇండస్ట్రీ హిట్’ అధినేత శివ కుమార్ బోయిదాపుకు ప్రతిష్ఠాత్మక ‘ఉత్తమ వెబ్‌సైట్ సంపాదకుడు’ పురస్కారం లభించింది.
తెలుగు డిజిటల్ జర్నలిజంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న శివ కుమార్ బోయిదాపు, నాణ్యమైన వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు, బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ, మా సంఘం ఉపాధ్యక్షుడు మాదాల రవి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం యువ జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!