

ఘట్టమనేని కుటుంబ వారసుడిగా జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విలక్షణ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామా తిరుపతి పరిసర ప్రాంతాల నేపథ్యంలో సాగనుందని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘యే మంగా హే మంగా’ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ఎనర్జిటిక్ ట్యూన్స్, క్యాచీ బీట్స్ యువతను ఆకట్టుకుంటుండగా, లిరికల్ వీడియోలో రషా థడానీ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా థడానీ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. కాసర్ల శ్యామ్ రాసిన ‘గాలుల్లో నీ శ్వాసే తెలుస్తోంది..’ వంటి లిరిక్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. టాప్ సింగర్ ఎల్.వి. రేవంత్ తన హై ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!