
క్రీడలు

‘మల్లెపూల పల్లకి’ సాంగ్ విడుదలైన తర్వాత సింగర్ వాయిస్ బేస్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. ఒరిజినల్ పాటతో పోలిస్తే వాయిస్ బేస్ సరితూగలేదన్న విషయం తమకు ముందే తెలుసని తెలిపారు. అయితే ఒరిజినల్ సాంగ్ విడుదలై 15 ఏళ్లకు పైగా కావడంతో, వయసు కారణంగా సింగర్ వాయిస్‌లో మార్పులు రావడం సహజమని వివరించారు.
ఒరిజినల్ సింగర్‌కు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పాటను డప్పు శ్రీనుతో పాడించామని శివ నిర్వాణ స్పష్టం చేశారు. పాటను కొత్తగా రూపొందించే క్రమంలో తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలను ఆయన వెల్లడిస్తూ, సింగర్‌పై వస్తున్న విమర్శలకు తనదైన రీతిలో వివరణ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!