

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందంటూ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి.
కోర్టు ఆదేశాలను పీటీఐ నేతలు స్వాగతించారు. ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య సంరక్షణ అవసరమని వారు పేర్కొన్నారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఇమ్రాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇమ్రాన్ 2023 నుంచి రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!