

అమరావతిలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. బీసీల సామాజిక, రాజకీయ అభ్యున్నతిని లక్ష్యంగా మూడు ప్రధాన నిర్ణయాలను మంత్రివర్గం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. గత పాలకులు బీసీల రిజర్వేషన్లను కాపాడలేకపోయారని విమర్శించిన ఆయన.. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. 34 శాతం రిజర్వేషన్ నిర్ణయం బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!