
టెక్నాలజీ

రణ్‌బీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయం నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ రూపొందనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సీక్వెల్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్ ఇచ్చారు.
ఫిబ్రవరి 13 న ‘యానిమల్’ జపాన్‌లో విడుదల కానున్న సందర్భంగా రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్ అభిమానులతో మాట్లాడుతూ ‘యానిమల్ పార్క్’ ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను 2027 లో ప్రారంభిస్తామని, 2028 లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!