
షోస్

'ఓ.! సుకుమారి' ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన హీరో తిరువీర్, ఈ చిత్రం తనను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. వినోదం, భావోద్వేగాలు, కొత్త తరహా కథాంశం కలగలిసిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిందన్నారు. ప్రేమకథకు వినూత్నమైన కాన్సెప్ట్‌ను జోడించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దారని చెప్పారు.
నటి ఐశ్వర్య రాజేష్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని తిరువీర్ పేర్కొన్నారు. ఆమె నటన తనను మరింత మెరుగ్గా నటించేలా ప్రేరేపించిందని తెలిపారు. దర్శకుడు భరత్ దర్శన్ కమర్షియల్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి అని ప్రశంసించిన ఆయన, జూలై 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న 'ఓ.! సుకుమారి' ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!