

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, దాదాపు 17 ఏళ్లుగా విజయవంతమైన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె, గత కొంతకాలంగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తన వృత్తి జీవితాన్ని సమతూకంగా కొనసాగిస్తూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు.
తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి సమంత ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. మయోసైటిస్ కారణంగా గత రెండేళ్లుగా సమంత ఉప్పు, రుచులు తక్కువగా ఉండే కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్నారని తెలిపారు. ఈ వ్యాధికి ప్రస్తుతం శాశ్వత నివారణ లేదని, లక్షణాలను నియంత్రించేందుకు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళన కలిగించినప్పటికీ, సమంత త్వరగా పూర్తిగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!