

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హీరోలు వెంకటేశ్, నాగార్జున, చిరంజీవితో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్ తదితరులు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ ప్రముఖులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహ వేడుక మరింత సందడిగా మారింది. నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సినీ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!