

భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పూర్తి ‘వందేమాతరం’ ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వందేమాతరాన్ని నిలిపివేయాలని సూచించినట్లు కొందరు వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యానాన్ని కాంగ్రెస్ ఖండించింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం కూడా మల్లికార్జున ఖర్గే నిలబడే ఉన్నారని, ఆయన కోసం కుర్చీ తీసుకురావాలని సోనియా గాంధీ సూచించిన సందర్భాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పార్టీ స్పష్టం చేసింది. వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించిన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. పూర్తి వందేమాతరం ఆలాపనపై ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ వీడియోకు ప్రాధాన్యం ఏర్పడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!