

నటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచే వ్యక్తుల గురించి మాట్లాడుతూ.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తనకు ఎంతో సన్నిహితుడని తెలిపారు. తాను డల్‌గా ఉన్న ప్రతిసారీ దుల్కర్ నుంచి మెసేజ్ వస్తుందని, తాను బాధలో ఉన్న విషయం ఆయనకు ఎలా తెలుస్తుందో అనిపిస్తుందని చెప్పారు. దుల్కర్‌తో కాసేపు మాట్లాడితే తన బాధంతా మర్చిపోతానని పేర్కొన్నారు. దుల్కర్ తర్వాత తాను ఎక్కువగా నమ్మే వ్యక్తి టాలీవుడ్ హీరో రామ్ అని అనుపమ వెల్లడించారు.
ఇదే ఇంటర్వ్యూలో అనుపమ తన గత ప్రేమ సంబంధం గురించి కూడా మాట్లాడారు. మాజీ ప్రియుడి నుంచి తాను ఎదుర్కొన్న నార్సిసిస్టిక్ అబ్యూస్ గురించి వివరించారు. ఇలాంటి మానసిక వేధింపులు బయటకు కనిపించకుండా చాలా నిశ్శబ్దంగా జరుగుతాయని, బాధితులను తమ నియంత్రణలో ఉంచుకోవాలని అలాంటి వ్యక్తులు ప్రయత్నిస్తారని చెప్పారు. గతంలో దుల్కర్ సల్మాన్, అనుపమ కలిసి జోమోంటే సువిశేషంగల్ అనే మలయాళ చిత్రంలో నటించారు. ఇక దుల్కర్ నటించిన I’M Game చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!