

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. విడుదలైన 9వ రోజైన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టికెట్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వేదికల్లో కలిపి 56 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో అదనపు షోలను కూడా ఏర్పాటు చేశారు. సెలవు రోజు వచ్చిన స్పందనతో చిత్రబృందంలో ఉత్సాహం నెలకొంది. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగుతుండటంతో లాంగ్ రన్లో సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా బీసీ కేంద్రాల్లో సినిమాకు మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. రితికా నాయక్ కథానాయికగా నటించగా, సత్య, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్, చిన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా, విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుండటం విశేషంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!