

ఓటీటీ వేదికపై భారీ ఆదరణ సొంతం చేసుకున్న మిర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. మూడు సీజన్లతో ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న ఈ క్రైమ్ డ్రామా ఫ్రాంచైజీ.. మిర్జాపూర్ ది మూవీగా వెండితెరపైకి రానుంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఇప్పటివరకు ఓటీటీలో మిర్జాపూర్ను చూసిన ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూసేందుకు టికెట్ కొనుగోలు చేస్తారా అనే చర్చ మొదలైంది. ఓటీటీ నుంచి నేరుగా థియేటర్లకు వస్తున్న ఈ ప్రయోగంపై అందరి దృష్టి పడింది.
మిర్జాపూర్ అభిమానుల నుంచి వచ్చిన డిమాండ్ కారణంగానే ఈ కథను సినిమాగా తీసుకురావాలని నిర్ణయించినట్లు నిర్మాత ఫర్హాన్ అక్తర్ తెలిపారు. కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా పాత్రలకు ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. ఓటీటీలో వ్యక్తిగతంగా చూసిన కథను ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో కలిసి ఆస్వాదించే అవకాశం లభిస్తుందని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ఓటీటీ కథలు వెండితెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మిర్జాపూర్ ది మూవీకి ప్రేక్షకుల స్పందన, టికెట్ వసూళ్లు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!