

నటి సమంత మహిళలపై సమాజంలో కొనసాగుతున్న ద్వంద్వ ప్రమాణాలపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వివిధ సందర్భాల్లో మహిళలనే తప్పుపట్టే విధానాన్ని ప్రశ్నిస్తూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహిళలపై జరిగే అన్యాయాలను మాత్రమే కాకుండా, వాటికి కారణమైన వ్యక్తులను, సమాజంలో ఉన్న ఆలోచనా విధానాలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందనే భావనను ఆమె తన పోస్టులో వ్యక్తం చేశారు.
లైంగిక కార్మికులను సమాజం తప్పుపడుతుందని, కానీ వారి సేవలను కోరుకునే వారిని అదే స్థాయిలో ప్రశ్నించదని సమంత ప్రస్తావించారు. అలాగే పిల్లల బాధ్యతను ఒంటరిగా మోస్తున్న తల్లులను విమర్శించే సమాజం.. బాధ్యత తీసుకోని తండ్రులను ఎందుకు నిలదీయదని ప్రశ్నించారు. అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలినే నిందించడం, నేరానికి పాల్పడిన వ్యక్తులను ప్రశ్నించకపోవడంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!