
సినిమాలు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ఫొటోగ్రాఫర్లపై కోపం వ్యక్తం చేసిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన అదే మీడియాతో సరదాగా వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫొటోగ్రాఫర్లు ఆయనకు సారీ చెప్పగా, ‘ఇంకా గట్టిగా సారీ చెప్పండి’ అంటూ సల్మాన్ సరదాగా వారిని ఆట పట్టించారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇటీవల ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఫొటోగ్రాఫర్లు సినిమా అప్డేట్ గురించి అడగడంతో సల్మాన్ కోపం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ‘రాజా శివాజీ’ ఈవెంట్లో ఆయన సరదాగా స్పందించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’తో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!