

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో భారీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక భవనాలు ధ్వంసమయ్యాయని కీవ్ అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ భేటీ కానున్న వేళ ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కీవ్‌లోని సైనిక-పారిశ్రామిక కేంద్రాలు, ఇంధన నిల్వలు, శక్తి మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రష్యా పౌర మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దాడులకు కొన్ని గంటల ముందే కీవ్‌పై భారీ దాడులు జరిగే అవకాశం ఉందని జెలెన్‌స్కీ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడగా, యుద్ధం ముగింపుపై చర్చించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!