
గాసిప్స్

ఆస్తి వేలం వివాదంపై నిర్మాత బండ్ల గణేశ్ స్పందిస్తూ, యూనియన్ బ్యాంక్ తన ఆస్తిని మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు అన్యాయంగా విక్రయించిందని ఆరోపించారు. 2022లో ఈ వ్యవహారాన్ని న్యాయస్థానంలో సవాల్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.
అయితే యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి తన హక్కులను చట్టబద్ధంగా సాధిస్తానని బండ్ల గణేశ్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!