
జనరల్

టాలీవుడ్‌లో కలకలం రేగింది. ప్రొడ్యూసర్ రజిత్ రావ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో ప్రొడ్యూసర్ వెంకట అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కోట్ల రూపాయలతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడి నుండి రూ.40 లక్షలు ఇప్పించి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 318(4), 351(2) కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!