
క్రీడలు

దేశంలో మిడిల్ క్లాస్ జనాభా అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ మరియు టాటా సన్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సగటు కుటుంబ ఆదాయంలో బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ అగ్రస్థానాల్లో ఉన్నప్పటికీ, మిడిల్ క్లాస్ విస్తరణలో హైదరాబాద్ ముందంజలో ఉంది.
ఇక ఢిల్లీ ఎన్‌సీఆర్ దేశంలో అతిపెద్ద వినియోగ కేంద్రంగా కొనసాగుతుండగా, ముంబై, పుణె, ఢిల్లీ నగరాలు ధనవంతుల కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. దేశంలోని టాప్ 100 నగరాలు మొత్తం ఆదాయం, వినియోగంలో మూడో వంతుకుపైగా వాటా కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రముఖ నగరాల్లో కటిక పేదరికం క్రమంగా తగ్గిపోతున్నదని కూడా వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!