

సాయి రాజేష్ తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. మంచి కథలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతోందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్, యూట్యూబ్ వ్యూస్, డిజిటల్ ప్రమోషన్స్ ప్రభావం సినిమా ఫలితాలపై ఎక్కువగా పడుతోందని, ఇవి నిజమైన ప్రేక్షకాదరణను ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ‘సమ్మర్ హాలిడేస్’ టీజర్ లాంచ్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ హైప్ ఎక్కువైందని, కంటెంట్ కన్నా ప్రమోషన్‌కే ప్రాధాన్యం పెరిగిందని అన్నారు. మంచి సినిమాలు కూడా సరైన గుర్తింపు పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బేబీ’ గురించి మాట్లాడుతూ, అదే సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే అప్పటిలా భారీ విజయాన్ని సాధించకపోయేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!