

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఓ..! సుకుమారి ప్రతి కుటుంబం కలిసి చూసే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి తెలిపారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం జూలై 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఎమోషన్, కామెడీ, వినోదంతో పాటు ‘షాక్’ అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు. కథ నచ్చిన తర్వాత దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్‌పై పని చేసి సినిమాను ప్రారంభించామని, ఐశ్వర్య రాజేష్ కోసం మూడు నెలలు వేచి చూసిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టామని వెల్లడించారు.
థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని అత్యుత్తమ నిర్మాణ విలువలతో రూపొందించామని నిర్మాత తెలిపారు. ప్రతి రూపాయికి విలువ ఉండేలా సాంకేతిక నాణ్యత, నటీనటుల ఎంపిక విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని వెల్లడించారు. మంచి కథకు భాషా పరిమితులు ఉండవని, అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని చెప్పారు. పోటీ ఎంత ఉన్నా మంచి సినిమా ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, తిరువీర్‌తో మరో సినిమా, సత్యదేవ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!