

టాలెంటెడ్ దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్న హీరోయిన్ ప్రాధాన్య చిత్రం క్వీన్లో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మీ ప్రణతి పాత్రను పోషించనున్నారు. వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈఆర్ యామినీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సాయికుమార్, అజయ్ ఘోష్, కాళకేయ ప్రభాకర్, తనికెళ్ల భరణి, నవీన్ బేతిగంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వాస్తవ ఘటనలు, నిజ జీవిత పాత్రల స్ఫూర్తితో ఫిక్షనల్ కథగా క్వీన్ను దర్శకుడు రతన్ రిషి రూపొందిస్తున్నారు. 2006 నుంచి 2010 మధ్యకాలం నేపథ్యంగా సాగే ఈ చిత్రం ప్రేమకథతో పాటు సమాజానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను కూడా ప్రస్తావించనుంది. రమ్యకృష్ణ చేరికతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!