
జనరల్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం మరోసారి వివాదంలో చిక్కుకుంది. సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన, ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయనే వార్తలపై కన్నడ నటి రిషికా సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై వీడియో సందేశం విడుదల చేసిన ఆమె. ఎంతోమందికి ఆదర్శంగా ఉండే యశ్ ఇలాంటి పాత్రను ఎలా అంగీకరించారంటూ ప్రశ్నించారు. కన్నడ సంస్కృతి, మహిళలను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా, యశ్ కర్ణాటకను విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ రిషికా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘టాక్సిక్’ చుట్టూ వివాదం మరింత ముదిరింది. యశ్ అభిమానులు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!