

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ENE Repeat రేపు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మరోసారి సైకో వివేక్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన గ్యాంగ్‌తో కలిసి మరోసారి వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన విశ్వక్ సేన్ భావోద్వేగానికి గురయ్యారు. ENE Repeatపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, తాను ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశానని, భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించవచ్చని చెప్పారు. అయితే, ఈ సినిమా మాత్రం తన కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని, తన విజయ కిరీటంలో ఓ కలికితురాయిగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సినిమా విషయంలో తాను ఎంతో నమ్మకంగా ఉన్నానని చెప్పిన విశ్వక్ సేన్, 80 ఏళ్ల తర్వాత ఎవరైనా ఈ చిత్రాన్ని చూసినా ఇది తెలుగు సినిమా అని గర్వపడతారని వ్యాఖ్యానించారు. ఈ సీక్వెల్‌లో భాగం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రంలో అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి, అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సీక్వెల్‌కు కూడా వివేక్ సాగర్ సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!