

అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం కింగ్ 100 డిసెంబర్ 24, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగార్జున ఎంతో ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఇది మైలురాయి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటివరకు చిత్ర బృందం టీజర్‌తో పాటు టబు పాత్ర పరిచయ వీడియోను మాత్రమే విడుదల చేసింది. ఈ రెండూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచినప్పటికీ, విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఇదే సమయంలో పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్ 100 మ్యూజిక్ ప్రమోషన్లతో పాటు ఇతర ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!