

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 20, 2026న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతున్నారు. విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దుల్కర్ సల్మాన్‌ను కొత్త పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో దుల్కర్ తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తెలుగు చిత్రం ‘శ్రీ శ్రీ’తో పాటు, తదుపరి తమిళ సినిమాకు ‘గోలి’ అనే టైటిల్ ఖరారైనట్లు ప్రకటించారు. అట్లీ వద్ద గతంలో అసిస్టెంట్‌గా పనిచేసిన కార్తికేయన్ వేలప్పన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇది ఆయనకు దర్శకుడిగా తొలి సినిమా కాగా, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. మరోవైపు, ‘ఆకాశంలో ఒక తార’కు ధనుష్ ‘ఓ.ఎం: ఆపరేషన్ మోల్’, తరుణ్ భాస్కర్ ‘ENE Repeat’, కీర్తి సురేష్ ‘సత్యవాన్ సావిత్రి’ చిత్రాల నుంచి బాక్సాఫీస్ పోటీ ఎదురుకానుంది. స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!