

బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా, ఘన విజయం సాధించిన హిస్టారికల్ చిత్రం ‘ఛావా’లో ఔరంగజేబు పాత్ర కోసం ముందుగా తనను సంప్రదించారని వెల్లడించారు. అయితే ఆ సమయంలో తాను ‘స్వతంత్ర్య వీర్ సావర్కర్’ సినిమా కోసం సిద్ధమవుతున్నానని, ఆ పాత్ర కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్న కారణంగా ‘ఛావా’లో నటించలేకపోయానని తెలిపారు. తాను ఆ పాత్రకు సరిపోనని భావించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అంతేకాకుండా, ‘ఛావా’ కథ మతపరమైన అంశాల చుట్టూ తిరుగుతుందని భావించానని, అదే సమయంలో ‘స్వతంత్ర్య వీర్ సావర్కర్’కు సంబంధించిన కోర్టు కేసును కూడా ఎదుర్కొంటున్నానని రణ్‌దీప్ పేర్కొన్నారు. అనంతరం ఆ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹800 కోట్ల వసూళ్లు సాధించింది. విక్కీ కౌశల్ నటనకు ప్రశంసలు దక్కగా, రష్మిక మందన్న కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!