
సినిమాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సీ 17 వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని మళ్లీ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో రామ్ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించిన కియారా, ఈసారి మళ్లీ అవకాశం దక్కించుకునే అవకాశం ఉంది.
గత సినిమాలు ఫలితం ఇవ్వకపోయినా, సుకుమార్ మాత్రం కియారా అద్వానీనే ఫైనల్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కథ, టెక్నికల్ టీం ఎంపికపై సుకుమార్ ఇప్పటికే దృష్టి పెట్టారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!