

ప్రముఖ నటుడు రామ్ చరణ్ తన కొత్త సినిమా “పెద్ది” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా వచ్చే నెల 4 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి వెళ్లే ప్రశ్నపై స్పందించిన రామ్ చరణ్, తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వినోద రంగంలోనే నంబర్ వన్‌గా నిలవాలని ఉందని తెలిపారు. రెండు పడవలపై ప్రయాణం చేయడం తనకు ఇష్టం లేదన్నారు.
“పెద్ది” గురించి మాట్లాడుతూ, ఇది తన కెరీర్‌లో అత్యంత నిజాయతీగా చేసిన సినిమా అని చెప్పారు. తన ఐడెంటిటీని కనుగొనే గ్రామీణ యువకుడి కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు. ఇలాంటి పాత్రలకు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు. రిస్కీ షాట్స్‌లో కూడా డూప్ లేకుండా తానే నటించడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు.
అలాగే విజయాపజయాలను పట్టించుకోనని, ఎప్పుడూ తనకు నచ్చిన పనినే చేస్తానని అన్నారు. స్టార్‌డమ్ గురించి ఆలోచించనని, మంచి సినిమాలపైనే దృష్టి ఉంటుందని రామ్ చరణ్ స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!