

తెలంగాణలోని మూడు ప్రధాన ప్రతిపాదనలకు కేంద్రం రూ.5,681 కోట్ల విలువైన అర్బన్ చాలెంజ్ ఫండ్ ( యూసీఎఫ్) నిధులకు ఆమోదం తెలిపింది. ఖమ్మం–వరంగల్–కరీంనగర్ కారిడార్, వరంగల్ మురుగునీటి ఆధునీకరణ, కరీంనగర్‌లో మోడల్ రోడ్లు, స్కై వాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు వంటి అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులకు కేంద్రం 25 శాతం నిధులు అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా 25 శాతం వాటా ఇవ్వనుంది. మిగిలిన మొత్తం హడ్కో రుణం ద్వారా సమకూర్చనున్నారు. ఇప్పటికే కేంద్రం రూ.1,420 కోట్లు విడుదల చేసింది. మొదట యూసీఎఫ్ జాబితాలో లేని కరీంనగర్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో జాబితాలో చేర్చి ఆమోదం పొందించారు.
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన 17 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.14,867 కోట్లుగా ఉంది. కరీంనగర్‌కు వచ్చిన రూ.840 కోట్లతో స్కై వాక్‌లు, మోడల్ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి, వరద నివారణ పనులు చేపట్టనున్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారి హైదరాబాద్ తర్వాత అత్యాధునిక నగరంగా అభివృద్ధి చెందనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!