

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ‘అమరన్’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం వచ్చిన ‘పరాశక్తి’, ‘మధరాసి’ సినిమాలు మిక్స్‌డ్ టాక్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ఈ క్రమంలో దర్శకుడు శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ‘సేయోన్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది.
తాజాగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ‘సేయోన్’ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు. ఇప్పటివరకు తన కెరీర్‌లో సంపాదించిన అనుభవాన్ని మొత్తం ఈ సినిమాకు ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే టీవీ నుంచి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన శివకార్తికేయన్ ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకమని ప్రశంసించారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో శివకార్తికేయన్ రూరల్ అవతార్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!