

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించడం చాలా పెద్ద రిస్క్‌లా కనిపించిందని తమన్నా తెలిపింది. ఒక ప్రాంతీయ తెలుగు చిత్రానికి రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టడం ఆ సమయంలో సాధారణ విషయం కాదని, ట్రేడ్ వర్గాలు కూడా దీనిని ప్రమాదకర నిర్ణయంగా చూశాయని చెప్పుకొచ్చింది.
సృజనాత్మక రంగంలో సాధారణ వ్యాపార సూత్రాలు పనిచేయవని తమన్నా అభిప్రాయపడింది. ఒక వ్యక్తి తన విజన్‌ను గట్టిగా నమ్మితే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చని పేర్కొంది. రాజమౌళి తన ఆలోచనపై పూర్తి నమ్మకంతో పనిచేసినందుకే ‘బాహుబలి’ లాంటి అద్భుతం సాధ్యమైందని తెలిపింది. ఇండస్ట్రీలో అవకాశాలను ఉత్తమంగా మలచుకోవడం చాలా ముఖ్యమని ఆమె చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!