

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుని.. 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్‌గా రికార్డు సృష్టించింది. ‘డ్రైవింగ్ త్రూ పెద్ది మెమోరీస్’ అనే ప్రత్యేక ఇంటరాక్షన్‌లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఈ కథను మరింత అభివృద్ధి చేయాలని దర్శకుడు సుకుమార్ ప్రోత్సహించారని, మొదటి నుంచే రామ్ చరణ్‌ను హీరోగా ఊహించుకున్నానని తెలిపారు.
మరోవైపు రామ్ చరణ్ మాట్లాడుతూ.. కథ మొదటి నరేషన్‌లోనే తనను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు. పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక బలమని బుచ్చిబాబు పేర్కొన్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!