
సినిమాలు

తన 158వ చిత్ర ప్రారంభ వేడుక సందర్భంగా నటుడు చిరంజీవి చేసిన భావోద్వేగ ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సమయం కేటాయించి కార్యక్రమానికి హాజరై క్లాప్ ఇవ్వడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని పవన్ కళ్యాణ్‌కు, చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇద్దరి మధ్య కనిపించిన క్లాప్ తనకు 30 సంవత్సరాల క్రితం జరిగిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్ర ప్రారంభ వేడుకను గుర్తు చేసిందని పేర్కొన్నారు.
“ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో, ఈ రోజు దానికి విరుద్ధంగా కనిపించడం ఆనందంగా ఉంది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. “లవ్ యూ కళ్యాణ్” అంటూ తమ్ముడిపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిరంజీవి 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!