

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుచ్చిబాబుతో కలిసి కార్ డ్రైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్, ఈ చిత్రంలో తనకు అత్యంత ఇష్టమైన భాగం ఢిల్లీ ఎపిసోడ్ అని తెలిపారు. సినిమాలో అత్యధిక ట్విస్టులు ఉండేది ఆ ఎపిసోడ్‌లోనేనని, ‘ఉప్పెన’లోని ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ సర్ప్రైజ్‌లు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ ఒక గ్రామీణ వ్యక్తి తన గుర్తింపును వెతుక్కునే భావోద్వేగ ప్రయాణమని ఆయన వివరించారు.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతం లేదని కూడా రామ్ చరణ్ స్పష్టం చేశారు. అభిమానులు సీఎంగా చూడాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, తాను వినోద రంగంలోనే నంబర్ వన్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకోవడం లేదన్నారు. ‘పెద్ది’ తన కెరీర్‌లో అత్యంత నిజాయతీగా చేసిన చిత్రాల్లో ఒకటని పేర్కొంటూ, రిస్కీ షాట్లలో కూడా డూప్ లేకుండా తానే నటించేందుకు ఇష్టపడతానన్నారు. 71 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి స్టంట్స్ చేస్తుండటం తనకు స్ఫూర్తి అని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!