
గాసిప్స్

పెద్ది సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఇందులో భాగంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి ఓ సరదా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజీ షెడ్యూల్లో కూడా తనను డ్రైవ్‌కు తీసుకువచ్చినందుకు రామ్ చరణ్‌కు బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు. దానికి స్పందించిన చరణ్ సరదాగా ‘‘పెద్ది ఎప్పుడు విడుదల అవుతుందో కచ్చితంగా చెప్పు’’ అని అన్నారు. అనంతరం జూన్ 4న సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులంతా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని ఇద్దరూ కోరారు. ఈ సరదా సంభాషణతో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!