

చిన్న బడ్జెట్, కానీ హృదయానికి దగ్గరగా ఉన్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ తెలుగు రాష్ట్రాల్లో చక్కగా హిట్ అవుతోంది. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి తీసిన ఈ విలేజ్ లవ్ స్టోరీ యువతలో ప్రత్యేకంగా ఫేమస్ అయ్యింది. అఖిల్ రాజ్, తేజస్విని రావు లతో హీరో, హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, వారి మొదటి ప్రయత్నం అయినా ప్రాణం పెట్టి నటన అందరిని ఆకట్టుకుంది. విలన్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ చేసిన నటనని హైలెట్‌గా చెప్పవచ్చు. నవంబర్ 21న రిలీజ్ అయిన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తక్కువ బడ్జెట్లో 14 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్‌లో అంచనాలకు మించి ప్రదర్శన ఇచ్చింది.
ఈ సినిమా నిజమైన సంఘటనలపై ఆధారపడి ఖమ్మం జిల్లా యల్లందుల్లో చిత్రీకరించబడింది. కొత్త దర్శకుడిగా సాయిలు తన టేకింగ్, మేకింగ్ స్టైల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమయ్యాడు. ఇంకా థియేట్రికల్ ప్రదర్శనలు హౌస్ ఫుల్‌గా కొనసాగుతున్న నేపధ్యంలో, ఈ సినిమాను ఓటీటీలో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే నేపథ్యంలో, ప్రముఖ ఓటీటీ సంస్థ ETV Win ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. అయితే థియేట్రికల్ రిలీజ్‌కి 50 రోజుల తరువాతే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవ్వనుంది. అంటే, జనవరి రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్కి అందుబాటులోకి రానుందని భావించవచ్చు.











కామెంట్స్ (1)
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిన్న బడ్జెట్‌తో పెద్ద విజయం సాధించడం నిజంగా ఇన్స్పిరేషన్!