
క్రీడలు

కే. రాఘవేంద్రరావు మరోసారి సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్, కృతి శెట్టిలతో ముహూర్తపు షాట్ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
సీన్ వివరించే క్రమంలో రాఘవేంద్రరావు గారు హీరోయిన్ల చేతులను పట్టుకుని తన వైపుకు లాగడం వీడియోలో కనిపించడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవసరం లేకుండా ఇలా తాకడం సరైంది కాదని, మాటలతోనే సీన్ వివరించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై ట్రోలింగ్ మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!