
సినిమాలు

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్ వేడుకతో పాటు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది.
అయితే, తాజాగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు సంపత్ నంది ఎక్స్ వేదికగా వెల్లడించారు. సాంకేతిక సమస్యల కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తనకు తెలుసని, వారిని నిరాశపరిచినందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!